విజిలెన్స్‌ విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ విచారణకు డిమాండ్‌

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

సోమశిల ప్రాజెక్ట్‌ దక్షిణ కాలువ మరమ్మతుల పేరుతో ఖర్చు చేసినట్లు చెబుతున్న రూ.10 కోట్ల నిధులపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.లీలామోహన్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ కాలువలో నీరు సక్రమంగా ప్రవహిస్తున్న సమయంలోనే మరమ్మతుల పేరుతో రూ.10 కోట్ల పనులు చేపట్టినట్లు చూపించడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఎక్కడ పనులు చేశారు?, ఏ పనులు చేపట్టారు? ఎంత మేరకు పూర్తయ్యాయి? అనే వివరాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్‌ షాన్‌వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement