తాగునీటి సమస్యపై నిరసన | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై నిరసన

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

అల్లూరు మండలంలోని గాలిదిబ్బలు, నాగులదేవిగుంట, చుక్కవానిదిబ్బ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ యానాదుల సంక్షేమ సంఘం నేతలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో ఏళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా, ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే తాత్కాలికంగా సరఫరా చేస్తున్నారన్నారు. రాపూరు మండలం గరిమెనపెంట, సంగం మండలం వెంగారెడ్డిపాళెం గ్రామాల్లో పొలాల సమస్యలు, కావలి, జలదంకి మండలాల్లో గోల్డ్‌ లోన్లకు సంబంధించిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, నేతలు రాపూరు కృష్ణయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తీరివీధి సతీష్‌చంద్ర, యల్లంపల్లి రమేష్‌, చెంబేటి ఉష, కల్లూరు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement