నెల్లూరు(అర్బన్): నెల్లూరు వేదాయపాళెం ప్రాంతంలోని ఓ చర్చిలో దివ్యాంగురాలైన ఓ బాలికపై లైంగికదాడి జరిగింది. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స బాలిక చికిత్స పొందుతోంది. సోమవారం ఐసీడీఎస్ పీడీ నాగశైలజ పరామర్శించి బాధితురాలి తల్లితో మాట్లాడా రు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పీడీ మాట్లాడుతూ పాపకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో బాలలసంరక్షణ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో
17 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 133, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు
(కిలో)
పెద్దవి : రూ.125
సన్నవి : రూ.60
పండ్లు : రూ.30


