నెల్లూరు సిటీ: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీని ఏహెచ్‌టీయూ బృందం గుర్తించింది. నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్‌రాజుపాళెంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో 2018లో వారి మధ్య విభేదాలు రావడంతో భర్తపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే ఎనిమిదేళ్ల తరువాత శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఆమె ఉన్నట్లు ఏహెచ్‌టీయూ బృందం గుర్తించింది. అనంతరం రూరల్ పోలీసులకు ఆమెను అప్పగించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుబ్బారావు, ఎస్సై భాస్కర్, ఏఎస్సై శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


