నేటి నుంచి ఐలు 13వ రాష్ట్ర మహాసభలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఐలు 13వ రాష్ట్ర మహాసభలు

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

నెల్లూరు(లీగల్‌): అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) 13వ రాష్ట్ర మహాసభలు శని, ఆదివారాల్లో నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర, జిల్లా నాయకులు తెలిపారు. మహాసభలకు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కస్తూర్బా కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఐలు వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాయవాది బీవీ రమణారెడ్డి మాట్లాడారు. న్యాయవాదుల సమస్యలతోపాటు ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐలు పనిచేస్తోందన్నారు. 1997లో నెల్లూరులో ఒకసారి రాష్ట్ర మహాసభలు నిర్వహించామని, దాదాపు మూడు దశాబ్దాల అనంతరం అదే వేదికగా 13వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వీటికి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, ఐలు కేంద్ర, రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఐలు రాష్ట్ర కోశాధికారి రమేష్‌, నాయకులు చుక్క రమేష్‌, గుంజి దయాకర్‌ తదితరులు మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారత్నం, రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణుడు, రేఖారాణి, కిరణ్‌, దీక్షిత్‌, సుదీర్‌, ప్రియాంక, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement