గాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రజాసేవ | - | Sakshi
Sakshi News home page

గాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రజాసేవ

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరురూరల్‌: మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జేసీ, డీఆర్‌ఓ విజయ్‌కుమార్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సేవ వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమన్నారు. ఉద్యోగులు క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement