తల్లిదండ్రుల చెంతకు బాల కార్మికుడు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చెంతకు బాల కార్మికుడు

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

దుత్తలూరు(ఉదయగిరి): గొర్రెల కాపరిగా ఉంటున్న బాలుడిని అధికారులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారిమఠానికి చెందిన ఊసా ఆశీర్వాదం, ఎస్తేరమ్మ దంపతులు జీవనం గడవక కుమారుడు రామయ్యను ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఓ రైతు వద్దకు గొర్రెల కాపరిగా పంపారు. ఆ బాలుడు తన కష్టాలు చెబుతూ కన్నీటిపర్యంతమైన వీడియో సోషల్‌ మీడియాలో బుధవారం వైరలైంది. గురువారం అధికారులు బాలుడి ద్వారా సమాచారం తెలుసుకుని దుత్తలూరు మండలం నర్రవాడలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇద్దరు పిల్లల్లో నాలుగేళ్ల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, వైద్యం కోసం నగదు లేకపోవడంతో కుమారుడిని గొర్రెల కాపరిగా ఉంచామని వివరించారు. డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, ఐసీడీఎస్‌ పీడీ శైలజ, బాలల సంరక్షణాధికారి సురేష్‌ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కుటుంబానికి ఇంటి స్థలంతోపాటు గుండె శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం, పొదుపు సంఘం ద్వారా రుణం, రామయ్యకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బాలుడిని ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను స్థానికులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement