పాల సేకరణలో పోట్లపూడి సొసైటీ బెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పాల సేకరణలో పోట్లపూడి సొసైటీ బెస్ట్‌

Oct 1 2026 12:11 AM | Updated on Oct 1 2026 12:11 AM

● సంఘం అధ్యక్షుడు సుధీర్‌రెడ్డికి సన్మానం

తోటపల్లిగూడూరు (పొదలకూరు): మండలంలోని పొట్లపూడి గ్రామానికి చెందిన రైతు, పాల సొసైటీ అధ్యక్షుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడు, డైరెక్టర్‌గా, జిల్లా డెయిరీ చైర్మన్‌గా మంచి గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహకారంతో ఏపీ డెయిరీ బాధ్యతలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో పోట్లపూడి పరస్పర పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ద్వారా విజయ డెయిరీకి అత్యధికంగా పాలు పోసినందుకు బుధవారం డెయిరీలో సంఘం అధ్యక్షుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. పోట్లపూడి పాల సొసైటీ ద్వారా విజయ డెయిరీకి అత్యధికంగా 1.75 లక్షల లీటర్ల పాలను పోసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఫలితంగా సొసైటీ అధ్యక్షుడిని విజయ డెయిరీ సర్వసభ్య సమావేశంలో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement