పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధం

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

● రాష్ట్ర పండగగా గుర్తింపుతో భారీ ఏర్పాట్లు

● నేటి నుంచి పోటెత్తనున్న భక్తజనం

వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర పండగ హోదాలో బుధ, గురువారాల్లో జరిగే జనజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం రాత్రి అమ్మవారు జీనుగుల వారి వీధి నుంచి ప్రత్యేక రథంపై నగరోత్సవంగా ఆలయం వద్ద కొలువుదీరనున్నారు. అనంతరం భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ వేంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, పోలేరమ్మ తల్లి పాలకవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గత ఆదివారం ఘటోత్సవంతో ఆరంభమైన జాతర ఐదురోజుల పాటు కనులల పండుగగా సాగుతోంది.

నేడు భిక్షాటన

బుధవారం వెంకటగిరి పట్టణంలో చిన్నారులు, మహిళలు, మడిభిక్షాలతో సందడి చేయనున్నారు. వేపాకు తోరణాలు నడుముకు కట్టుకుని వేయి కళ్లు దుత్తలు తలపై పెట్టుకుని ఆసాదుల తప్పెట్ల తాళాల మధ్య ఇంటింటా తిరుగుతూ భిక్షాటన చేయనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వెంకటగిరి చేరుకున్నారు. కుమ్మరింట ఆడపడుచుగా భావించే పోలేరమ్మ తల్లిని బుధవారం కుమ్మరీలు వెంకటగిరి రాజాల వద్ద నుంచి సాంగ్యం తెచ్చుకు అమ్మవారి విగ్రహం తయారీకి అనుమతి తీసుకుంటారు. సిద్ధమైన తర్వాత కుమ్మరివారి మొదటి పూజ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7 నుంచి రాత్రి 11 గంటల్లోపు భక్తుల దర్శనార్థం కొలువుదీరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement