రోడ్డు ప్రమాదాలు.. ఆగని కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలు.. ఆగని కన్నీళ్లు

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

రెప్పపాటులో జరిగిన రోడ్డు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. మరోవైపు గాయపడిన పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాంగ్‌రూటే మృత్యుపాశమైంది

కొడవలూరు: రాంగ్‌రూట్‌ ప్రయాణం మృత్యుపాశమైంది. వేగంగా వెళ్లిన మోటార్‌బైక్‌ ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెం మజరా టపాతోపు హైవే క్రాసింగ్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళేనికి చెందిన తాతా శ్రీహరి (35) బైక్‌పై మరో వ్యక్తిని ఎక్కించుకొని నెల్లూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరి.. టపాతోపు హైవే క్రాసింగ్‌ మూసివేసి ఉండటంతో రామన్నపాళెం హైవే క్రాసింగ్‌ నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్లారు. నార్తురాజుపాళెం నుంచి ఒడిశాకు చెందిన రాజు, అతని సోదరి బోరోజునాలీ బైక్‌పై నెల్లూరు వైపు వస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వేగంగా వెళ్లిన శ్రీహరి ఎదురుగా వస్తున్న రాజు బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీహరి తలకు తీవ్ర గాయమై అక్కడకక్కడే మృతిచెందాడు. రాజు, బోరోజునాలీకి తీవ్రగాయాలయ్యాయి. శ్రీహరి బైక్‌పై వెనుకనున్న వ్యక్తి ప్రమాదం జరగడంతో స్వల్పంగా గాయపడి పారిపోయాడు. క్షతగాత్రులకు 108 ఈఎంటీ జార్జ్‌, పైలట్‌ సునీల్‌ ప్రాథమిక చికిత్స అందించి నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీహరికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతడి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించడం చూపరులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

క్రాసింగ్‌ మూసివేతతో సమస్య

టపాతోపు హైవే క్రాసింగ్‌ను రెండు నెలల క్రితం మూసివేయడంతో నార్తురాజుపాళెం, కొడవలూరు, విడవలూరు, అల్లూరు మండలాల వైపు వెళ్లే వాహనదారులు అదనంగా సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కొందరు రామన్నపాళెం క్రాసింగ్‌ నుంచి రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. క్రాసింగ్‌ మూసివేసిన తర్వాత రాంగ్‌రూట్‌ ప్రయాణాల కారణంగా ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. గతంలో ఈ ప్రాంతంలో ఇంత తరచుగా ప్రమాదాలు జరగలేదు. రాంగ్‌రూట్‌ ప్రయాణాలను అరికట్టేందుకు రామన్నపాళెం క్రాసింగ్‌ వద్ద పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ.. సిబ్బంది పరిమితంగా ఉండటంతో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయంగా వినియోగంలో లేని అండర్‌పాస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. హైవే క్రాసింగ్‌ మూసివేతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాంగ్‌రూట్‌ ప్రయాణాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన రాజు, బోరోజునాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement