యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ పరిధిలోని ఆకుతోట దళితవాడ సమీపంలో సాయి అపార్ట్‌మెంట్‌ వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. అపార్ట్‌మెంట్‌లో నివసించే మేకల అఖిల్‌కుమార్‌ (25) వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నెల్లూరులో వ్యాన్‌ రిపేర్‌ పనులు ముగించుకుని రాత్రి 9:40 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. 11 గంటల వరకు మేనల్లుడితో ఉన్నాడు. అనంతరం మద్యం తాగేందుకు తన అపార్ట్‌మెంట్‌ కిందకు వెళ్లాడు. 11:45 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌ గేటు సమీపంలో కుక్కలు మొరుగుతుండగా విన్న అఖిల్‌ మేనమామ అరవ మణి కిందకు వెళ్లి చూశాడు. అఖిల్‌ కుమార్‌ కింద పడిపోయి ఉన్నాడు. అతని నుదుటిపై గీసుకుపోయిన గాయం, ఎడమ కంటి కింద రక్తగాయాలు కనిపించాయి. ముక్కు నుంచి రక్తం వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు అఖిల్‌ను రామచంద్రారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గేటు సమీపంలో పడిపోవడంతోనే తన కుమారుడు మృతిచెంది ఉండొచ్చని, లేదా మరేదైనా కారణం ఉంటుందని తల్లి మేకల సువర్చల అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

కండలేరులో

17.21 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 17.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 130, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement