బైక్‌ను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్‌

Sep 29 2026 11:58 PM | Updated on Sep 29 2026 11:58 PM

రాపూరు: ఏర్పేడు – రాపూరు జాతీయ రహదారిపై మోటార్‌బైక్‌ను వెనుక నుంచి కోళ్ల వ్యాన్‌ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బండేపల్లి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం తాతిపల్లి నుంచి డక్కిలి మండలం పలుగోడుకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. రాపూరు నుంచి వెంకటగిరి వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్‌ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది నాగరాజు, అబ్దుల్‌ ఖాదర్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిని రాపూరు మండలం చెల్లటూరుకు చెందిన శివారెడ్డి (35), తాతిపల్లికి చెందిన గోపాల్‌గా గుర్తించారు. శివారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సిబ్బంది ఆక్సిజన్‌ అందిస్తూ నెల్లూరుకు తరలిస్తుండగా చనిపోయాడు. గోపాల్‌కు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement