రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 17.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 130, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
మందుల
కొనుగోలుకు వెళ్లి..
● గేదెను ఢీకొట్టిన బైక్
● వ్యక్తి మృతి
కోవూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పోతిరెడ్డిపాళెం చంద్రశేఖర్‌పురం గిరిజన కాలనీ మార్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చంద్రశేఖరపురానికి చెందిన నెల్లూరు వెంకయ్య (55)కు ఆస్తమా ఉంది. ఈ నేపథ్యంలో మందులు కొనుగోలు చేసేందుకు మోటార్‌బైక్‌పై వారధి సెంటర్‌లోని మెడికల్ షాపునకు వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. శనైశ్చరస్వామి ఆలయ సమీపంలో గేదెను ఢీకొట్టాడు. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం పోలీసు లు కేసు నమోదు చేశారు.


