● విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
వాకాడు: వీధిలైట్లు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కొండూరుపాళెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సోలా రమేష్ (40) గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఊరిలో వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు 20 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కాడు. లైట్లు అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురైన రమేష్ పైనుంచి కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. రమేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అతడిది తమిళనాడు రాష్ట్రం. ఆరునెలల క్రితం తన భార్యతో గొడవపడి కొండూరుపాళెంలోనే ఉంటున్నట్లు చెబుతున్నారు.


