నేత్రపర్వంగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రథోత్సవం

Sep 27 2026 11:54 PM | Updated on Sep 27 2026 11:54 PM

చిట్టమూరు: వుల్లాంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నేత్రపర్వంగా ఆదివారం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను రథంపై కొలువుదీర్చి వివిధ పుష్పాలతో అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులను చెల్లించుకున్నారు. ఉభయకర్తగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చిల్లకూరు కోదండరామిరెడ్డి వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి, భరతనాట్యాన్ని రాత్రి ప్రదర్శించారు. వాకాడు సీఐ హుస్సేన్‌బాషా, ఎస్సై నాగరాజు తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement