కూటమి పాలన.. కర్షకుడికి కన్నీటి వేదన | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలన.. కర్షకుడికి కన్నీటి వేదన

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

● జిల్లాలో రైతులకు సాగునీటి తిప్పలు

● శ్రీశైలంలో నీరున్నా సోమశిలకు విడుదలలో నిర్లక్ష్యం

● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు(పొదలకూరు) : కూటమి ప్రభు త్వం దుష్ట పాలన కారణంగా జిల్లాలో రైతాంగానికి కన్నీటి వేదన మిగిలిందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతుల విషయంలో చంద్రబాబు సర్కారు అత్యంత దయనీయంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. సాగు నుంచి ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. శ్రీశైలంలో సమృద్ధిగా నీరున్నా సోమశిలకు నీటిని విడుదల చేయకపోవడం రైతులకు శాపంగా మారిందన్నారు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సౌత్‌అములూరు గ్రామాల్లో కాకాణి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జిల్లాకు సాగునీటిని విడుదల చేయించకపోవడం వల్లనే తీవ్ర కష్టాలు ఏర్పడినట్టు ధ్వజమెత్తారు. సోమశిలకు నీటిని విడుదల చేయించమని పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. నీటి యాజమాన్య హక్కులు కలిగి ఉన్న నెల్లూరు డెల్టా రైతులకు సైతం సాగునీటి కష్టాలు తప్పడం లేదన్నారు. చిన్నపాటి అంశంపై గొంతు చించుకుని అరిచే అధికార పార్టీ నాయకులు సాగునీటి వ్యవహారంలో ఎందుకు మౌనం వీడడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించడంలో ఎందుకు విఫలం అయ్యారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డెల్టా రైతులకు సంబంధించి రైపేరియన్‌ హక్కుల ప్రకారం నీళ్లు ఇవ్వాలని అడిగేందుకు వెళితే నెల్లూరు బ్యారేజీ వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నట్టు విమర్శించారు.

క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితులు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన సమయంలో ధరలు పాతాళంలో ఉంటే.. దళారులు, మిల్లర్లు దగ్గర నిల్వలు పెంచుకున్నాక.. అమాంతంగా పెరుగుతున్నాయన్నారు. మార్కెట్లో పుట్టి ధాన్యం రూ.35 వేలు ధరలు ఉంటే.. రైతుల దగ్గర రూ.20 వేల నుంచి రూ.22 వేలకే కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి సమయంలో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 28 నెలల తర్వాత చంద్రబాబు కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని ప్రజలను మోసగిస్తున్నట్టు తెలిపారు. పింఛన్లను ఇస్తామని ఆశ చూపించి అభాగ్యులను టీడీపీలోకి చేర్చుకునేందుకు నాటకాలకు తెరలేపినట్టు విమర్శించారు. ఏదోక విధంగా ప్రలోభాలకు గురి చేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నట్టు ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం లేదని, గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని కార్యకర్తలు, నాయకులు మనోధైర్యంతో పోరాటం చేసి విజయం సాధించడం ఖామన్నారు. కాకాణి పర్యటలో భాగంగా జెడ్పీటీసీ సభ్యురాలు ఎంబేటి శేషమ్మ మనుమడు తాడి బాలరాజు–సౌమ్య వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. సౌత్‌ఆములూరుకు చెందిన శశికుమార్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కాకాణి వెంట చిల్లకూరు సుధీర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement