● రూ.8 కోట్ల విలువైన
వెండి, బంగారం స్వాధీనం
గూడూరు: పట్టణంలోని బంగారు, కుదవ దుకాణాలపై వాణిజ్య పన్నుల శాఖ, విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.8 కోట్ల విలువైన 5.29 కేజీల బంగారం, 17.4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులకు ఒక వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా బంగారం, వెండికి సంబంధించిన ఆధారాలతో కూడిన బిల్లులను చూపితే అందుకు సంబంధించి పన్నును లెక్కకట్టి అందజేస్తామని తెలిపారు. వారంలోగా సరైన ఆధారాలు చూపకపోతే సంబంధిత దుకాణాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ నరసింహారావు,జీఎస్టీ అధికారి విష్ణు, శాంతిభూషణ్, సిబ్బంది పాల్గొన్నారు.


