జెడ్పీటీసీలను అవమానించడం.. ప్రజాతీర్పును అగౌరవించడమే | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీలను అవమానించడం.. ప్రజాతీర్పును అగౌరవించడమే

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

నెల్లూరు(వేదాయపాళెం): జెడ్పీ సర్వసభ్య, అత్యవసర సమావేశాలకు అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులు హాజరుకాకుండా జెడ్పీటీసీలను అవమానించడం అంటే వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలను అగౌరవ పరచడమేనని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై చర్చించి పరిష్కరించేందుకు జెడ్పీలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఈ నెల 17న నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి సైతం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకాకపోగా అధికారులను సైతం అడ్డుకుని జెడ్పీటీసీలను ఘోరంగా అవమానించారన్నారు. జెడ్పీటీసీలు జిల్లా నలుమూలల నుంచి ప్రజాసమ్యలను పరిష్కరించేందుకు వస్తారని, అటువంటి వారిని అవమానించి నిరుత్సాహపరచడం మంచిపద్ధతి కాదని హితువుపలికారు. అనంతరం ఈ సమావేశానికి అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జెడ్పీ సమావేశాల్లో ప్రజాపతినిధులు, అధికారులు ప్రజాసమస్యలపై చర్చించి తీర్మానాలు చేసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కానీ అధికార పార్టీ నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా చిత్తశుద్ధితో ప్రజాసేవ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులకు అడ్డుతగిలి అవమానించడం దారుణమన్నారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి మాట్లాడుతూ అరుణమ్మ కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం అత్యంత బాధాకరమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు ప్రజల కోసం పరితపించి తమ పదవీకాలంలోని చివరి నిమిషం వరకు నిస్వార్థం, నిజాయతీ, అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ ఆనం అరుణమ్మ తమకు తల్లి వంటి వారని, గత రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఎంతో ఓర్పు,సహనం, సంయమనంతో జిల్లా ప్రజలు, జెడ్పీటీసీలకు సహకారం అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత చైర్‌పర్స్‌న్‌ను పదవి నుంచి దించేందుకు ఎన్నో కుటిల యత్నాలు చేశారని ఆరోపించారు. అయితే వారి కుయుక్తులు, ప్రలోభాలకు లొంగి టీడీపీకి అమ్ముడుపోయేవాళ్లు, పార్టీని వీడే వారు ఎవరూ లేరని ధీటుగా జెడ్పీటీసీలు బదులిచ్చారని తెలిపారు. అరుణమ్మ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా ప్రజలకు సేవ చేశామనే సంతృప్తి తమకు లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో రెండు తీర్మాలను ప్రవేశపెట్టారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సాగు, తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, జెడ్పీ సభ్యులు, జెడ్పీ సమావేశాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గైర్హాజవుతున్న సీఈఓను సస్పెండ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం చైర్‌పర్సన్‌ అనం అరుణమ్మ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన అత్యవసర సమావేశం

కరువు పరిస్థితులపై చర్చకు

అధికారులు డుమ్మా

అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి

ప్రజాసమస్యలను విస్మరించడం తగదు

ముక్తకంఠంతో నినదించిన జెడ్పీటీసీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement