● అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడగలను
● అవినీతిలో సోమిరెడ్డితో పోటీ పడలేను
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అంతులే ని అవినీతి చోటు చేసుకుందని, సోమిరెడ్డితో అభివృద్ధి, సంక్షేమంలో మాత్రమే తాను పోటీ పడగలని, అవినీతి కార్యకలాపాల్లో పోటీ పడలేని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం విరువూరు, ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాళెం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి, ఆయన కొడుకు, అల్లుడు కూటమిగా ఏర్పడి సర్వేపల్లిని నిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు. దేవాలయ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అమ్ముకోవడం, ఇరిగేషన్‌లో దొంగ బిల్లులు చేసుకుని ప్రజాధనం లూటీ చేయడం, సహజ సంపదను కొల్ల గొట్టడం, రియల్ ఎస్టేట్‌లో వాటాలు వేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో గ్రామాల్లో శాంతి నెలకొల్పాలని ప్రయత్నించానన్నారు. కేసులు పెట్టించి రౌడీషీట్లు ఓపెన్ చేయించలేదన్నారు. ప్రజ లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించానన్నా రు. సోమిరెడ్డిలా లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బు లు దండుకోలేదని, మట్టి, గ్రావెల్, ఇసుక, బూడిదలను వదలకుండా సొమ్ము చేసుకోలేదన్నారు. విరువూరు గ్రామానికి వెళుతుంటే రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. ఇసుక టిప్పర్లు ఇష్టానుసారంగా వెళ్లడం వల్లనే రోడ్లు గుంతలమయంగా మారాయ న్నారు. రేయింబళ్లు ఇసుకను తోలుతున్నారని, అవినీతి స్వార్థప్రయోజనాల కోసం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లిన తన మార్కు అభివృద్ధి కనిపిస్తోందని, సోమిరెడ్డి చేసిన అభివృద్ధిని చూపాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎం వెంకటశేషయ్య, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఉడతా రమేష్, నెల్లూరు శివప్రసాద్, దశకంఠాద్రిశర్మ, తదితరులు ఉన్నారు.


