పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలి

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

● నోట్లో గడ్డి పెట్టుకుని వినూత్నంగా

ఐద్వా మహిళల నిరసన

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ నెల్లూరు నగర ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో 15,16 డివిజన్లకు చెందిన మహిళలు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఏమి కొనలేకున్నామని, గడ్డి తిని బతకాల్సిన పరిస్థితి నెలకొందని నోట్లో గడ్డిపెట్టుకుని బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి పూలే విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా, నగర అధ్యక్ష, కార్యదర్శులు మస్తాన్‌బీ, కత్తి పద్మ, సుబ్బమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయని ఆరోపించారు. కిలో బియ్యం రూ.70కు చేరడంతో పాటు పప్పు ధాన్యాలు, నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను చూస్తుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ఎన్నికల సమయంలో తాముఽ అధికారంలోకి వస్తే రేషన్‌ దుకాణాల ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement