● అన్నా చెల్లికి గాయాలు
మనుబోలు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై పొదలకూరు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం వేకువజామున బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో అన్నా, చెల్లెలు గాయపడ్డారు. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఎస్.బాలు తన సోదరి శైలజతో కలిసి బైక్‌పై నెల్లూరుకు వస్తున్నారు. పొదలకూరు క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకునే సరికి బాలు నిద్రమత్తు కారణంగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుకు తీవ్ర గాయాలు కాగా శైలజ స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


