పెన్నా నదిలో వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

పెన్నా నదిలో వ్యక్తి మృతదేహం

Aug 16 2026 12:45 AM | Updated on Aug 16 2026 12:45 AM

సంగం: సంగం ఆనకట్ట వద్ద పెన్నా నదిలో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భోజ్యా నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. కాగా మృతుడు ఏఎస్‌పేట మండలం హసనాపురానికి చెందిన షేక్‌ ఖాసిం సాహెబ్‌గా గుర్తించారు. ఇటీవల కాలంలో ఆయన మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement