కొడవలూరు: టీడీపీ నాయకుల దాడిలో గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు ధారా ప్రియాంకను మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈనెల ఒకటో తేదీన మండలంలోని వెంకన్నపురం ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిందన్న అక్కసుతో టీడీపీ నాయకులు ప్రియాంకపై దాడి చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రసన్న అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు, కొడవలూరు, కోవూరు పార్టీ మండలాధ్యక్షులు చిమటా శేషగిరి, అత్తిపల్లి అనూప్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కాండ్ర పల్లవి, నాయకులు బండి పెంచలయ్య, మందపల్లి మల్లికార్జున, శ్రీనివాసులు, సుధాకర్, క్రాంతి, కార్తీక్, ఏడుకొండలు, ప్రభాకర్ పాల్గొన్నారు.


