● బిర్యానీ దుకాణం ధ్వంసం
● నిర్వాహకుడిపై దాడికి యత్నం
వెంకటాచలం: మండలంలోని వెంకటాచలం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో ఉంటున్న బిర్యానీ దుకాణ నిర్వాహకుడు కోడూరు విజయ్‌పై టీడీపీ అల్లరిమూకలు శనివారం రాత్రి దాడికి యత్నించాయి. ఆ సమయంలో విజయ్ నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారై సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న బిర్యానీ దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ కాలనీవాసులతో కలిసిపోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో ఆదివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఐ అంకమ్మకు దాడి గురించి వివరించారు. వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ నెలరోజుల నుంచి కొందరు టీడీపీ అల్లరిమూకలు నీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఇంటికొచ్చి కులం పేరుతో దూషించి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు.


