వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం కల్పిస్తాం

Oct 4 2026 11:51 PM | Updated on Oct 4 2026 11:51 PM

● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

● జనార్దనరెడ్డి కాలనీలో

50 కుటుంబాలు పార్టీలో చేరిక

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని 54వ డివిజన్‌ జనార్దన్‌రెడ్డి కాలనీలో వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు నూకలపాటి సురేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి మాట్లాడుతూ నూకలపాటి సురేష్‌తోపాటు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారందరికీ గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సురేష్‌ సేవలను పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటామని తెలిపారు. 53, 54 డివిజన్లలో మొదటి నుంచి వైఎస్సార్‌సీపీకి ప్రజల నుంచి ఆదరణ ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పెన్నా పరీవాహక ప్రాంతమైన వెంకటేశ్వరపురంలో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి జరిగినట్లు తెలిపారు. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో 53, 54 డివిజన్ల నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, డివిజ ఇన్‌చార్జి మస్తాన్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement