నెల్లూరురూరల్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయొద్దని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులో సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్లు డి.రమణయ్య, కె.లుక్సన్, టీఎంఎం రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని కోరారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు వేలకుపైగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆస్తి అయిన ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలను ఉద్యోగుల పక్షాన జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. షబ్బీర్, ఓవీ ప్రసాద్, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.


