ముత్తుకూరు(పొదలకూరు): పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇష్టానుసారంగా కత్తితో పొడిచాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలోని బలిజపాళెం గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా అల్లుడు కరకంబాక గురవయ్య (34) తన మామ గండవరపు ఏడుకొండలు (52)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నెల్లూరు(పొగతోట): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.సూర్యకుమారి తెలిపా రు. సోమవారం ఆమె నారాయణరెడ్డిపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదలలో లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, సీడీపీఓ అరుణ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


