మేనేజర్‌ వైఖరి వల్లే తమ బిడ్డ మృతి | - | Sakshi
Sakshi News home page

మేనేజర్‌ వైఖరి వల్లే తమ బిడ్డ మృతి

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

న్యాయం చేయాలని కుటుంబీకుల ఆవేదన

కొడవలూరు: మండలంలోని బొడ్డువారిపాళెం పెట్రోల్‌ బంకు మేనేజర్‌ వైఖరి వల్లే తమ బిడ్డ సురేష్‌ మృతిచెందాడని తల్లి గుండ్రి పోలీసుల వద్ద వాపోయారు. బొడ్డువారిపాళెం వద్ద హైవేపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ గిరిజన తండాకు చెందిన యువకుడు కె.సురేష్‌ శుక్రవారం మృతి చెందడం తెలిసిందే. ఈ క్రమంలో సురేష్‌ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శనివారం కొడవలూరు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ బొడ్డువారిపాళెం పెట్రోల్‌ బంకులో ఫిల్లింగ్‌ బాయ్‌గా చేరితే సంబంధం లేని బంకు మేనేజర్‌ తీసుకెళ్లారని, పని పూర్తయ్యాక మార్గమధ్యలో సురేష్‌కు బైక్‌ ఇచ్చి పంపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను వేడుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్‌రావు జోక్యం చేసుకుని పెట్రోల్‌ బంకు మేనేజర్‌తో మాట్లాడి మృతుని కుటుంబీకులకు రూ.2.20 లక్షల పరిహారం చెల్లించేలా ఒప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement