వేంపాడులో చోరీల కలకలం | - | Sakshi
Sakshi News home page

వేంపాడులో చోరీల కలకలం

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

అదుపులో అనుమానితులు

వరికుంటపాడు: మండలంలోని వేంపాడు గ్రామంలో శనివారం పట్టపగలే దేవాలయానికి చెందిన సామగ్రి, ఓ ఇంట్లో చోరీలు జరగ్గా, గ్రామస్తులు ఐదుగురు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని రామాలయానికి చెందిన ఇత్తడి చెంబు, బిందె, రెండు గంటలు, తదితర సామగ్రిని పంచాయతీ భవనంలో భద్రపరచగా, వాటిని దుండగులు అపహరించారు. దీనికి సమీపంలోనే పోలిచెర్ల షాజిదా నివాసంలో సుమారు ఐదు సవర్ల బంగారు ఆభరణాలు, గొలుసు, ఉంగరం, గుండ్లకమ్మలు తదితర నగలను చోరీ చేసినట్లు బాధితులు గుర్తించి కేకలు వేయగా గ్రామస్తులు వెంటనే స్పందించారు. అదే సమయంలో ఆటోలో వెళ్తున్న అనుమానితులను అడ్డుకుని తనిఖీ చేయగా, వారి వద్ద దేవాలయానికి చెందిన సామగ్రి లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, నలుగురు మహిళలు, ఓ పురుషుడు సహా మొత్తం ఐదుగురిని ఆటోతో పాటు వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. దేవాలయానికి చెందిన సామగ్రి స్వాధీనం అయినప్పటికీ, ఇంట్లో చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్న బంగారు ఆభరణాలు లభించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement