మావిగన్ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఆ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన మహిళలను ప్రత్యేకించి రాధాకృష్ణ రాతలు, వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్ యజమాని తీరును ఖండిస్తూ చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


