మాకు ద్రోహం తలపెట్టిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టబోము. తమిళ బోట్లలో వచ్చిన అక్కడి మత్స్యకారులు మా బతుకుదెరువును దెబ్బకొట్టి.. వేట మొత్తం దోచుకుని పోతున్నారు. వారిని ఎదుర్కొన్న సందర్భంలో రక్తగాలయాలకు గురయ్యాం. బోట్లు, వలలు ధ్వంసం చేస్తే నష్టపోయాం. ఏనాడూ ప్రభుత్వం కానీ, అధికారులు మాకు అండగా నిలబడలేదు. మా ప్రాణాలకు తెగించి బోట్లను పట్టుకుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం మాకు అన్యాయం చేయడం తగదు.
– సున్నపు హరినారాయణ, మత్స్యకారుడు, ఇస్కపల్లిపాళెం, అల్లూరు మండలం


