మా ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉంచితే.. రాత్రికి రాత్రే వాటిని వదిలేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి. స్థానికంగా ఉండే మత్స్యకారుల కడుపులు కొట్టి.. పక్క రాష్ట్రంలోని వాళ్లకు సపోర్టు చేయడం ఎంత వరకు సబబు. మా సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రణరంగమే అవుతుంది. పాకలలో జరగబోయే 164 మత్స్యకార గ్రామాల పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే.. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అదే అమలు చేస్తాం.
– వాయిల తిరుపతి, తుమ్మలపెంట, కావలి రూరల్ మండల కన్వీనర్


