● డ్రైవర్‌కు గాయాలు
ఆత్మకూరు: టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుకనే ధాన్యం లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొన్న ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు–ముంబై రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ వివరాల మేరకు.. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అదే క్రమంలో తిరుపతికి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ వెనుకనే వస్తూ నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీకొంది. దీంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో పాటు డ్రైవర్ భాషుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో నిలిచి ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


