నెల్లూరురూరల్: గుడ్ ఫ్రైడేగా సందర్భంగా శుక్రవారం నెల్లూరు 51వ డివిజన్ కపాడిపాళెంలో ఉన్న సెయింట్ జోసెఫ్ క్యాథెడ్రల్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో కార్యక్రమంలో నగర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనశిలువ మోసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ఏసుక్రీస్తు ప్రజల కోసం అనుభవించిన బాధలు, ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి సందీప్, కార్పొరేటర్ సాహిత్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో సీఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రూరల్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి శిలువ మోశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● నెల్లూరు(బృందావనం): నగరంలోని అన్ని చర్చీల్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలను ఆలపించారు.


