షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

రూ.2 లక్షల నష్టం

చిల్లకూరు: గూడూరు రెండో పట్టణంలోని జీఎస్‌ రాయులు సినిమా హాల్‌ ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణంలో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు.. సురేష్‌ అనే వ్యక్తి జీఎస్‌ రాయులు హాల్‌ సమీపంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రైవేట్‌ బస్సుల్లో తనిఖీలు

అనుమసముద్రంపేట: మండల కేంద్రంలోని దొరసానమ్మ తోటలో ఉన్న ప్రైవేట్‌ బస్సులను బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు, ఆత్మకూరు సీఐ గంగాధర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఏఎస్‌పేట దర్గా నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్‌ బస్సులు తిరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక, పోలీస్‌, రవాణా శాఖల అధికారులు వాహనాలపై దృష్టి పెట్టారు. డ్రైవర్లకు, యజమానులకు తగిన సూచనలిచ్చారు. అతి వేగంగా బస్సులు నడపరాదని సూచించారు. వారి వెంట ఏఎస్‌పేట ఎస్సై సైదులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement