● వివాహిత బలవన్మరణం
చిల్లకూరు: ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గూడూరు రెండో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన దేశాయిశెట్టి నిర్మల కుమార్తె వీణా జెస్సీకి గూడూరు రెండో పట్టణానికి చెందిన పంచేటి వంశీతో 2021లో వివాహమైంది. వారికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఇటీవల కాలంలో వంశీ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధించేవాడు. గురువారం ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వీణా జెస్సీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నిర్మల మాట్లాడుతూ తన కుమార్తెను వంశీ మానసికంగా, శారీరకంగా తరచూ వేధిస్తుండే వాడని చెప్పారు. పలుమార్లు ఇద్దరి మధ్య వివాదాలు నెలకొనడంతో సర్ది చెప్పామని తెలిపారు. అయితే వంశీ ఎక్కువగా వేధించడంతోనే జెస్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.


