రైల్లో మహిళ ప్రసవం | - | Sakshi
Sakshi News home page

రైల్లో మహిళ ప్రసవం

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

తల్లీబిడ్డ క్షేమం

నెల్లూరు(క్రైమ్‌): ఓ గర్భిణి రైల్లో ప్రయాణిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. రైల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నా యి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదిపూడి మనోజ్‌, వెంకటేశ్వరమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకటేశ్వరమ్మ గర్భిణి. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో చెరువు గుంతల వద్ద కాపలా ఉండేందుకు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం చీరాల నుంచి పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బయలు దేరారు. రైలు కావలి రైల్వేస్టేషన్‌ దాటగానే వెంకటేశ్వరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యా యి. మనోజ్‌, కుటుంబ సభ్యులు ఆమెకు ధైర్యం చెబుతూ ఉండగానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బిట్రగుంట రైల్వే అధికారులు వైద్యబృందంతో ప్లాట్‌ఫారంపై సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే వైద్యులు భోగిలోకి వెళ్లి ఆమెను పరీక్షించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం నెల్లూరు 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. రైలు నెల్లూరు స్టేషన్‌కు రాగానే 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement