టీడీపీ పాలనలో రైతులకు సంతోషమేదీ..? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో రైతులకు సంతోషమేదీ..?

Mar 22 2026 1:32 AM | Updated on Mar 22 2026 1:32 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం: టీడీపీ ప్రభుత్వంలో రైతు కుటుంబాలకు సంతోషమే కరువైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ గొట్లపాళెంలో శనివారం ఆయన పర్యటించారు. ధాన్యం ధరలను పూర్తిగా తగ్గించేశారని, వీటితో పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వా పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతుండటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. ధరలు తగ్గుముఖం పట్టకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పట్టించుకోకపోతే కర్షకుల పక్షాన నిలిచి అధికారులను నిలదీస్తామని స్పష్టం చేశారు. సకాలంలో యూరి యా అందక.. సాగునీరు పారక అష్టకష్టాలు పడి పంటలను పండించిన ఽరైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు. ఇరిగేషన్‌ పనుల పేరిట దొంగ బిల్లు లు చేసుకొని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంపై లేదని విమర్శించారు. వారం వ్యవధిలోనే ధరలు పూర్తిగా పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారున్నారని తెలిపారు.

గతంలో 25 శాతం అధికంగా..

గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే 25 శాతం అధికంగా రైతులకు లభించిందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధరను కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఏటా రూ.మూడు వేల కోట్లను కేటాయించారని, అయితే ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లనే కేటాయించి చేతు లు దులుపుకొందని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను.. చంద్రబాబు పాలనను బేరీజేసుకొని నాటి పాలనే భేష్‌ అంటూ ప్రశంసిస్తున్నారని తెలియజేశారు. మద్దతు ధరను కల్పించకపోతే జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్‌ నలగర్ల దేవసేనమ్మ పార్థివదేహానికి పూలమాలేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. వైస్‌ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, నలగర్ల నరసింహరావు, మందల శీనయ్య, నలగర్ల రంగయ్య, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement