ఈద్‌ – ఉల్‌ – ఫిత్ర్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ – ఉల్‌ – ఫిత్ర్‌ శుభాకాంక్షలు

Mar 21 2026 4:53 AM | Updated on Mar 21 2026 4:53 AM

నెల్లూరు రూరల్‌: ఈద్‌ – ఉల్‌ – ఫిత్ర్‌ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలను శుక్రవారం విడుదల చేశారు.

నెల్లూరు(దర్గామిట్ట): ఈద్‌ – ఉల్‌ – ఫిత్ర్‌ను జిల్లాలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల ని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటన లో కాంక్షించారు. ఈ మేరకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు.

నేటి పదో తరగతి

పరీక్ష వాయిదా

నెల్లూరు (టౌన్‌): పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షను ఏప్రిల్‌ రెండో తేదీకి వాయిదా వేశారని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ పరీక్ష శనివారం జరగాల్సి ఉందని, అయితే రంజాన్‌ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుందని వివరించారు.

● ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతికి సంబంఽధించి శనివారం నిర్వహించాల్సిన గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వ పరీక్షను వచ్చే నెల మూడుకు వాయిదా వేశారని డీఈఓ పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు జరగనుందన్నారు.

జలాశయ

ఆప్రాన్‌ పరిశీలన

సోమశిల: సోమశిల జలాశయాన్ని ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి శుక్రవారం సందర్శించారు. నిలిచిపోయిన ఆప్రాన్‌ పనులను ప్రాజెక్ట్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇవి మూడు రోజుల్లో ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. శివాలయ పక్కన ఉన్న రక్షణ గోడ ఎత్తు పెంచే విషయమై ప్రాజెక్ట్‌ చైర్మన్‌ కేశవ చౌదరి, సంబంధిత అధికారులతో చర్చించారు.

పెంచలకోనలో

వేలం పాటలు

రాపూరు: పెంచలకోనలో వచ్చే నెల్లో నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటలను శుక్రవారం నిర్వహించారు. దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం లభించిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ ఏడు వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు గానూ వేలాన్ని నిర్వహించామని వివరించారు.

ప్రభుత్వ భూమిని

పరిశీలించిన జేసీ

సీతారామపురం : మండలంలోని పెద్దనాగంపల్లిలో సర్వే నంబర్‌ 54 – 4లో గల 14 ఎకరాల ప్రభుత్వ భూమిని జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఆనం సంజీవరెడ్డి హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణానికి అటవీ భూమిని కేటాయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు కేటాయించేందుకు పెదనాగంపల్లిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించామని తెలిపారు. తహసీల్దార్‌ ఫాజిహా, మండల సర్వేయర్‌ శ్రీకాంత్‌, వీఆర్వో మురళి, తదితరులు పాల్గొన్నారు.

చంద్రశేఖర్‌రెడ్డి

గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement