వినతుల వెల్లువ
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
కొంతమంది దివ్యాంగులకు మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్లలో తప్పులున్నాయని, దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నెల్లూరు జిల్లా బధిరుల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు పి.మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.నరేష్ తదితరులు కోరారు.
రికార్డులు తారుమారు చేసి..
పిత్రార్జితం భూమి రెండు ఎకరాలకు సంబంధించి కొందరు అధికార బలంతో రికార్డులు తారుమారు చేసి పాసుపుస్తకాలు సృష్టించుకున్నారు. ఈ విషయమై ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించాం. ఇప్పటికి నాలుగుసార్లు అర్జీలిచ్చా. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– దేపూరు కమలాకర్,
ఆత్మకూరు మండలం నాగులపాడు
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ
వినతుల వెల్లువ


