చందన, సీఎంఆర్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): చందన, సీఎంఆర్ ఫెస్టీ వండర్ డ్రా స్కీమ్ 2వ స్కూటీ డ్రాను ఏపీఐడబ్ల్యూఏ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ జెడ్.శివప్రసాద్, డాక్టర్ ప్రసన్నలక్ష్మి సోమవారం తీశారు. రామ్‌నగర్‌కు చెందిన ఈ.తేజను హీరో ప్లెజర్ స్కూటీ విజేతగా ప్రకటించారు. అలాగే డైలీ డ్రా తీసి పి.భాస్కర్ (మిక్సీ), సీహెచ్ రమాదేవి (రైస్ కుక్కర్), డి.మధు (డిన్నర్‌సెట్)లను ప్రకటించారు. గత వారం డైలీ విజేతలు 35 మందికి గృహోపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం చందన, సీఎంఆర్‌లను నెలకొల్పి నెల్లూరు ప్రజలకు చేరువయ్యారన్నారు. చందన అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము ప్రవేశపెట్టిన ఫెస్టీ స్కీమ్‌లో బంగారం తక్కువ ధరతోపాటు 25శాతం తరుగు తగ్గించి ఇస్తున్నామన్నారు. వస్త్రాలపై 1+1 ఆఫర్స్‌తోపాటు 2వ శారీని ఒకరూపాయికి అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, మాల్ మేనేజర్ కిషోర్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(లీగల్): జిల్లా కోర్టు యూనిట్‌లోని నెల్లూరు, నెల్లూరు (ఎకై ్సజ్) గూడూరు, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు, ఖాళీగా ఉన్న ఆరు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తిగల వారు దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చే నెల 3 తేదీలోపు పంపాలని కోరారు. అర్హతలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు జిల్లా ప్రధాన న్యాయస్థానం, అదనపు జిల్లా న్యాయస్థానంలోని నోటీసు బోర్డు, సెషన్స్ న్యాయస్థానంలోని నోటీస్ బోర్డులో ఉంచినట్లు వెల్లడించారు.
తండ్రిని తిట్టారని మనస్తాపం చెంది..
● యువకుడి బలవన్మరణం
కొండాపురం: మండల కేంద్రానికి చెందిన మాచవరపు పృథ్వీ (21) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపురం ఎస్సై జె.మాల్యాద్రి కథనం మేరకు.. వెంకట్రావు స్థానికంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన రామినేని సురేంద్ర, చిరమన గ్రామానికి చెందిన చిట్టికి రూ.10 వేల నగదు విషయంలో ఫోన్‌లో ఆదివారం అర్ధరాత్రి వివాదం జరిగింది. వెంకట్రావు పక్కనే ఉన్న కుమారుడు పృథ్వీ ఫోన్ తీసుకుని సురేంద్ర, చిట్టితో మాట్లాడాడు. వారి మధ్య పెద్ద వివాదం జరిగింది. పృథ్వీ సోమవారం తెల్లవారుజామున సురేంద్ర ఇంటికి వెళ్లాడు. అతను టూర్‌కు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో పృథ్వీ ఇంటికొచ్చాడు. తండ్రిని సురేంద్ర, చిట్టి ఫోన్‌లో తిట్టారని మనస్తాపంతో గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పృథ్వీ ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టారు. పృథ్వీని 108 అంబులెన్స్‌లో వింజమూరు హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చందన, సీఎంఆర్‌లో లక్కీ డ్రా


