జోగి రమేష్‌తో కుటుంబ సభ్యుల ములాఖత్
వెంకటాచలం: నకిలీ మద్యం తయారీపై అక్రమ కేసులో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగార రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను సోమవారం ఆయన సతీమణి శకుంతలమ్మ, కుమారులు రాజీవ్, రోహిత్ ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారిని జైలు వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గాలు రోజు రోజుకు పరాకాష్టకు చేరుతున్నాయని, జోగి రమేష్‌పై పెట్టిన అక్రమ కేసు నిలువదని, ఆయన నిర్దోషి గా బయటకు వస్తారని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు చెప్పారు.
25వ తేదీ లోపు ‘పది’
పరీక్ష ఫీజు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 13 నుంచి 25వ తేదీలోపు ఫీజు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26వ తేదీ రూ.200 అపరాధ రుసుంతో వచ్చే నెల 10వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, ఫెయి ల్ అయిన విద్యార్థులు 3 సబ్జెక్ట్‌లకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్‌లకు రూ.125 చెల్లించాలన్నారు. వృత్తి విద్య విద్యార్థులకు రూ.125లతోపాటు అదనంగా రూ.60 చెల్లించాలన్నారు. ఫీజు చెల్లింపు http:// bse. ap. gov. in వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్ ద్వారా చేయాలన్నారు.
శబరిమలకు
ప్రత్యేక బస్సులు
● ఈ నెల 17వ తేదీ నుంచి
జనవరి 10 వరకు
నెల్లూరు సిటీ: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో–1 మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం టూర్ ప్యాకేజీ కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు మూడు కేటగిరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ లగ్జరీ రూ.4 వేలు, అల్ట్రా డీలక్స్ రూ.3,900, ఎక్స్‌ప్రెస్ రూ.3,300 టికెట్ ధరలుగా నిర్ణయించినట్లు వివరించారు. నవంబర్ 17, 22, 23, 27, 30, డిసెంబర్ 1, 3, 5, 6, 7, 11, 14, 15, 17, 22, 26, 27, 31, జనవరి 3, 5, 10వ తేదీల్లో బస్సులు బయలుదేరుతాయన్నారు. ఇది ఐదు రోజుల ప్యాకేజీ టూర్ అని చెప్పారు. నెల్లూరు నుంచి బయలుదేరి కాణిపాకం, భవానీ, ఎరి మేలి, పంబకు వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు కుర్తాళం, మధురై, చైన్నె, మేళమరువత్తూర్‌కు వెళుతుందన్నారు. బస్సులను అద్దె రూపంలో కూడా శబరిమల ప్యాకేజీలో కేటాయిస్తామన్నారు. వివరాలకు 99592 25641, 94921 92238 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు కరిమున్నీసా తదితరులు పాల్గొన్నారు.
జోగి రమేష్‌తో కుటుంబ సభ్యుల ములాఖత్


