గోళ్లవారిపల్లికి మృతదేహాలు
వింజమూరు (ఉదయగిరి): ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనం అయిన గోళ్ల రమేష్, అనూష, మన్విత, శశాంక్ మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్ష అనంతరం ఆదివారం కర్నూలులో బంధువులకు అప్పగించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలు రెండు ప్రత్యేక అంబులెన్స్‌ల్లో స్వగ్రామం గోళ్లవారిపల్లికి చేరుకున్నాయి. దీంతో ఒక్కసారి బంధువులు ,గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాలి ముద్దయిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళి అర్పిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు.


