గూడ్స్ రవాణాతో అదుపు తప్పే ప్రమాదం
ట్రావెల్స్ బస్సులు గంటకు 130 నుంచి 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బస్సు కింద, పైభాగంలో టన్నుల్లో గూడ్స్ ఉండడం వల్ల మితిమీరిన వేగంలో బస్సు అదుపు తప్పుతున్నాయి. బస్సుకు ఆకస్మికంగా గేదె, లేదా ఏదైనా వాహనం అడ్డొస్తే బస్సు కంట్రోల్ చేయలేకపోవడంతో డివైడర్లను ఢీకొనడమో, ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొనడం జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో పేలుడు లేదా ఏదైనా మంటలు వ్యాపించే పదార్థాలు ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బస్సులో ఉన్న ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడడం లేదా క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ప్రతి రోజు ఏదొక ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురువుతున్న పరిస్థితులను చూస్తునే ఉంటాం. ఈ విషయాలు తెలిసినా వారి ఆదాయంపైనే దృష్టి పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యాలు వారి పద్ధతిని మార్చుకోవడం లేదు.


