
చికిత్స అందిస్తే కోలుకుంటారు
సమాజంలో మానసిక సమస్యలున్న వారి సంఖ్య పెరగడం బాధాకరం. ఇలాంటి వారికి ప్రాథమిక లక్షణాలున్నప్పుడే గుర్తించి తగిన చికిత్స అందిస్తే కోలుకుంటారు. చికిత్సతోపాటు ఒత్తిడిని జయించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలి. లేకుంటే చిన్న సమస్యలకే కోపం, ఆత్మన్యూనత, ఆత్మహత్య లాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వారికి హిప్పో థెరపీ, బిహేవియర్ థెరపీ, సైకో థెరపీ చికిత్సలు అవసరం. ప్రస్తుతం ఇతర శారీరక అనారోగ్యాలకు చికిత్స అందిస్తున్నట్టుగానే మానసిక జబ్బులకు చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీప్రసూన, మానసిక వైద్య విభాగం హెచ్‌ఓడీ, సర్వజన ఆస్పత్రి, నెల్లూరు