
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు.. ప్రభుత్వ సంస్థలకు వారధిగా ఉంటూ బాధ్యతతో మెలగాలని పేర్కొన్నారు. న్యాయసేవ విధులు, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి, లోక్‌అదాలత్ ప్యానల్ న్యాయవాదులు టంగుటూరి గోపాల్‌రెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీప్రసాద్, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.