
అటవీ ప్రాంతంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
సీతారామపురం: మండలంలోని పండ్రంగి బీట్ అటవీ ప్రాంతాన్ని గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం గురువారం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా స్క్వాడ్ బృంద ఎఫ్‌ఆర్వో సుబ్బారావు మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బంది డేగకన్ను వేయాలని సూచించారు. అడవుల సంరక్షణపై అంకితభావంతో పనిచేయాలని కోరారు. అటవీ సంపదను ఎవరైనా అక్రమంగా నరికి తరలిస్తున్నారనే అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో ప్రసాద్, ఎఫ్‌ఎస్వో అశోక్, ఎఫ్బీఓలు గౌతమ్, సాయి, ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.