గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి

Sep 28 2025 7:28 AM | Updated on Sep 28 2025 7:28 AM

గంగమ్

గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి

ఉలవపాడు: మండలంలోని బద్దిపూడిలో గంగమ్మ తిరునాళ్లకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వలేదు. కొందరు టీడీపీ నాయకులు తమకు తెలియకుండా తిరునాళ్ల చేస్తున్నారని అడ్డుకోవడంతో పోలీసు శాఖ సైతం వారికే మద్దతు ఇస్తూ తిరునాళ్ల నిర్వహించవద్దని, అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ నేతల కుట్రలను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు కోర్టుకెళ్లడంతో తిరునాళ్ల నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది. శుక్రవారం రాత్రి కోర్టు ఆర్డర్‌ రావడంతో శనివారం నుంచి గ్రామస్తులు తిరుణాళ్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీఎస్టీ రాయితీలను వినియోగించుకోవాలి

నెల్లూరు (టౌన్‌): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ ఫలాలను ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గాంధీబొమ్మ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని నిత్యావసర సరుకులు, మందుల ధరలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరికి సేవింగ్స్‌ పెరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్లు లబ్ధి చేకూరుతుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా రకాల వస్తువులు ధరలు తగ్గుతాయన్నారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,358 మంది స్వామి వారిని దర్శించుకోగా 29,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.

డీఎస్పీగా

లింగసముద్రం వాసి

లింగసముద్రం: లింగసముద్రం గ్రామానికి చెందిన పొలిమేర సుదర్శన్‌రెడ్డి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో 20వ ర్యాంక్‌ సాధించాడు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నాడు. సుదర్శన్‌రెడ్డిని పలువురు అభినందించారు.

గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి 1
1/1

గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement