
సోమశిలకు 34,200 క్యూసెక్కుల వరద
● పెన్నాకు 25,650 క్యూసెక్కుల విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి 34,200 క్యూసెక్కుల ప్రవహం వస్తోందని చెప్పారు. 7, 8 క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 25,650.. కండలేరుకు 4000.. ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. జలాశయంలో 73.246 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. 99.932 మీటర్ల నీటిమట్టం నమోదైందన్నారు. వరద తగ్గేంత వరకు ఆప్రాన్ మీదుగా వాహనాలకు అనుమతిలేదని పేర్కొన్నారు.
డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ
నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ సోమవారం ఆవిష్కరించారు. చింతారెడ్డిపాళెంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్యాయానికి గురవుతున్న పార్టీ శ్రేణులకు అండగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

సోమశిలకు 34,200 క్యూసెక్కుల వరద