
విన్నపాలు వినవలె..
● కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● 500కు పైగా వినతులు
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మండలాధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చాం. ఇక్కడైనా మా బాధలు విని స్పందించండి’ అని పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి అర్జీలు సమర్పించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అర్జీలు 500కిపైగా వచ్చాయి. కలెక్టర్, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డ్వామా పీడీ గంగా భవాని తదితర అధికారులు వినతులు తీసుకున్నారు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు
పెరమన గ్రామం సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇద్దరు మంత్రులు పరామర్శకు రాలేదు. విధిలేని పరిస్థితిలో మృతదేహాలతో న్యాయం చేయాలని ధర్నా జరిపాం. దీంతో ఆర్డీఓ రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఇంకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దళిత కుటుంబాల్లో సర్వం కోల్పోయి వీధిన పడిన బిడ్డలకు ఇంటికొక ఉద్యోగం కల్పించాలి. అలాగే నష్టపరిహారం ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేసి ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి.
– ధనలక్ష్మి, అశ్విని, సౌందర్య, వెంగమ్మ, వైష్ణవి (మృతుల కుటుంబ సభ్యులు), కాయంపు శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు (సీపీఎం నాయకులు)
ఇంగ్లిష్ మీడియం దూరం
గత ప్రభుత్వంలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరిచిందని ఇంగ్లిష్ మీడియం విద్యాపరిరక్షణ వేదిక అధ్యక్ష, కార్యదర్శులు దాదినబోయిన ఏడుకొండలు, ఈదర గోపిచంద్ తెలిపారు. ప్రతి జిల్లా తిరుగుతూ గుంటూరు నుంచి వచ్చిన ఏడుకొండలు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ట్యాబ్, టోఫెల్ శిక్షణ, బైజుస్ కంటెంట్, సీబీఎస్‌ఈ సిలబస్ తొలగింపు లాంటి చర్యలు చేపట్టిందన్నారు. పేదలకు ఇంగ్లిష్ విద్య అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తెలుగు మీడియంకు తాము వ్యతిరేకం కాదన్నారు. తెలుగును ఒక భాషగా ఇంటర్, డిగ్రీ వరకు కూడా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తే ప్రపంచ విషయాలు అర్థమవుతాయన్నారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు.
దారి లేకుండా కంచె వేశారు
మేము వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమని ఇంటికి దారి లేకుండా మున్సిపల్ కౌన్సిలర్ శివారెడ్డి, ఆయన అనుచరులు కంచె వేశారు. సర్వే నంబర్ 198లో ఉన్న గ్రామ పొరంబోకు స్థలాన్ని శివారెడ్డి ఆక్రమించాడు. దీంతో నాలుగు ఇళ్లకు దారి లేకుండాపోయింది. ప్ర శ్నిస్తే అధికార పార్టీ అండతో దౌర్జన్యం చేస్తున్నారు. ఆర్డీఓ ఒకసారి, కలెక్టర్‌కు రెండుసార్లు అర్జీలిచ్చాను. వీఆర్వో సర్వే చేయకుండానే చేసినట్టు చూపి అర్జీని ఆన్‌లైన్‌లో క్లోజ్ చేసి మాకు అన్యాయం చేశారు.
– యనమల రాంబాబు, వెంకట్రావుపల్లి, ఆత్మకూరు మున్సిపాలిటీ

విన్నపాలు వినవలె..

విన్నపాలు వినవలె..

విన్నపాలు వినవలె..